Tag Archives: cm jagan

పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం బాధ్యతను మిథున్ రెడ్డికి అప్పగించిన సీఎం జగన్!

జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో, వైసీపీ అగ్రనాయకత్వం పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేయగా, రెండో చోట్లా ఆయను వైసీపీ అభ్యర్థులే ఓడించారు. గతంలో పవన్ ను ఎలా ఓడించారో, ఈసారి కూడా అలాగే ఓడించేందుకు వైసీపీ వ్యూహకర్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎంపీ వంగా గీతను ఈసారి పిఠాపురం అసెంబ్లీ బరిలో దించుతున్నారు. ఈ ...

Read More »

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2011, 2017లో ఈస్ట్‌ రాయలసీమ నుంచి రెండుసార్లు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీనివాసులు రెడ్డి…ఇవాళ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Read More »

వైసీపీలో చేరిన ముద్రగడ.. ఆహ్వానించిన CM జగన్

కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. సీఎం జగన్ దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు. ఐదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని తెలిపారు. జగన్ లాంటి నాయకుడు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు.

Read More »

ఏపీలో మళ్లీ ఫ్యాన్‌దే గెలుపు

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి విజయదుందుభి మోగిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే హవా అని మరో సర్వే స్పష్టం చేసింది. పొలిటికల్‌ క్రిటిక్‌ సర్వేలో మొత్తం 175 సీట్లలో 121 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. అలాగే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 54 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.

Read More »

నేషనల్ లా యూనివర్సిటీ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

సీఎం జగన్ ఇవాళ రాయలసీమ పర్యటనకు విచ్చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టులో జాతీయ లా యూనివర్సిటీ పనులకు శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. లా యూనివర్సిటీ పైలాన్ ను కూడ ఆవిష్కరించారు. 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో ఈ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయ నిర్మాణం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Read More »

మ్యారేజ్ స్టార్.. మరోసారి పవన్ కల్యాణ్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

జనసేన చీఫ్ పవన్ కల్యాన్ పెళ్లిళ్లపై ఏపీ సీఎం జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ లలో విశ్వసనీయత లేదని.. మరొకరికి విలువలు లేవన్నారు. పేదవాడి భవిష్యత్ మీదకు యుద్ధంగా కూటమి వస్తోందన్నారు. 2014లో కూడా ఇప్పుడు చెప్పే మోసపూరిత హామీలిచ్చారన్నారు. చంద్రబాబు సంతకంతో నాడు హామీలు ఇచ్చారని.. గతంలో రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఎగనామం పెట్టారన్నారు. 2014లోనూ మహిళలకూ ఎన్నో హామీలు ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. ఆడపిల్ల పుడితే రూ.25వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. ఇంటికో ఉద్యోగం లేకపోతే ...

Read More »

వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల..

వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు సీఎం జగన్‌ రిలీజ్‌ చేశారు. బనగానపల్లె లో సెంట్రల్ లైటింగ్, ఈబిసి నేస్తం, 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద్ద అక్కచెల్లెమ్మలకు రూ.629 కోట్లు నేడు జమ చేసుకున్నామని చెప్పారు. నేడు అందిస్తున్న రూ. 629 కోట్లతో ...

Read More »

నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులో నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అనంతరం ప్రజాప్రతినిధులు, న్యాయ అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యి పలు అంశాలపై చర్చించారు. అనంతరం సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ…అభివృద్ధి వీకేంద్రీకరణే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఉద్దేశంమన్నారు. హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోను హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు సీఎం జగన్. కర్నూలులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ యూనివర్శిటితో ...

Read More »

ఏపీ వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఈ మేరకు జీవో నంబర్ 40, 41 జారీ చేసారు స్పెషల్ సీఎస్ కృష్ణబాబు. ఇప్పటికే 1977 మందిని రెగ్యులర్ చేసిన వైద్యారోగ్య శాఖ…. తాజాగా మరో 397 మందిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. దింతో ఇప్పటివరకు 2,374 మందిని రెగ్యులర్ చేసింది జగన్ ...

Read More »

ముఖ్యమంత్రిగా జగన్ గెలవడం ఖాయమన్న పెద్దిరెడ్డి..

తిరుపతి జిల్లాలోని వాకాడులో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి అయినా తరువాత ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలవడం ఖాయం అని పేర్కొన్నారు. చాలా మంది ముఖ్యమంత్తులుగా పని చేశారు. ఇచ్చిన హామీలను పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అంటూ ఆయన కొనియాడారు.

Read More »