అప్పుడే టాలీవుడ్‌ పెద్దలు స్పందించి వుంటే బాగుండేది : నాని

నాని హీరోగా నటించిన సినిమా ‘శ్యామ్‌ సింగ రాయ్’ ఈ నెల 24న విడుదలై.. హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకల్లో నాని చేసిన వ్యాఖ్యలతో ఎపిలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నానికి ఇండిస్టీ పెద్దల నుండి అభిమానుల నుంచి భారీగా సపోర్ట్‌ లభించింది. తాజాగా మరోసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసి హాట్‌ టాపిక్‌ అయ్యారు. అసలు టాలీవుడ్‌కు ఈ సమస్య మొదలయింది ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం నుంచే అంటూ మాట్లాడారు. అప్పుడే టాలీవుడ్‌ పెద్దలందరూ స్పందించి ఉంటే బాగుండేదని,  ఇప్పుడు ఈ సమస్య ఇంత పెద్దదైయ్యేది కాదని నాని పేర్కొన్నారు.  ప్రస్తుతం నాని వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.