Crime

కవితకు కస్టడీనా? .. బెయిలా?

ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 15న కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమె కస్టడీని మొత్తం 10 రోజుల పాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు.కవిత కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో, ఈ ఉదయం 11 గంటల సమయంలో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కవితను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఈడీ కోరే అవకాశం ఉంది. మరోవైపు, ...

Read More »

మిస్సింగ్ మొబైల్ గా పేర్కొన్న ఈడీ అధికారులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపొందించిన సమయంలో ఉపయోగించిన ఫోన్ గురించి ప్రశ్నించగా తెలియదని సీఎం కేజ్రీవాల్ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఆదివారం విచారణలో భాగంగా ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ ఫోన్ ఎక్కడ ఉందో తనకు తెలియదని కేజ్రీవాల్ చెప్పినట్టుగా సమాచారం. కాగా ఈ ఫోన్‌ను మిస్సింగ్ మొబైల్ గా ఈడీ అధికారులు పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్టు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్టులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఈ కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉన్నదని మేక శరణ్ కవితకు అత్యంత ...

Read More »

క‌విత క‌స్ట‌డీని మూడు రోజులు పొడిగింపు..

లిక్క‌ర్ కేసులో ఏడు రోజుల ఈడీ క‌స్ట‌డీ ముగియడంతో ఎమ్మెల్సీ క‌విత‌ను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌ను మ‌రో 5 రోజుల క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని ఈడీ కోరింది. ఇరువైపుల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం క‌విత క‌స్ట‌డీని మూడు రోజులు పొడిగించింది. అంత‌కుముందు త‌మ విచార‌ణ‌కు క‌విత స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఈడీ ఆరోపించింది. స‌మీర్ మ‌హీంద్ర‌తో క‌లిపి క‌విత‌ను ప్ర‌శ్నించాల‌ని తెలిపింది. లిక్క‌ర్ స్కామ్ లో రూ. కోట్ల‌లో కిక్ బ్యాక్‌లు అందాయ‌ని ఈడీ పేర్కొంది.క‌విత ఫోన్ డేటాను తొలిగించిన‌ట్లు ...

Read More »

ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ రైడ్స్..

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత భర్త బంధువుల ఇళ్లలో ఈడీ ఈ ఉదయం సోదాలకు దిగింది. కవిత అరెస్ట్ తర్వాత జరుగుతున్న రైడ్స్ కావడంతో మరోమారు కలకలం రేగింది. ఈ ఉదయం 6.40 గంటలకు మాదాపూర్‌లోని డీఎస్ఆర్ హోమ్స్‌కు చేరుకున్న ఈడీ అధికారులు ఏ-బ్లాక్‌లోని మూడో అంతస్తులో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు ప్రారంభించారు.

Read More »

నేడు సుప్రీం కోర్టులో కల్వకుంట్ల కవిత కేసు విచారణ

కల్వకుంట్ల కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సుప్రీం కోర్టులో కల్వకుంట్ల కవిత కేసు విచారణ జరుగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీం కోర్టులో సవాలు చేశారు కల్వకుంట్ల కవిత. తనపై ఎలాంటి చర్యలు ఈడి తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు కల్వకుంట్ల కవిత. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటీషన్‌ వేశారు కల్వకుంట్ల కవిత. ఇక ఇవాళ ఈడీ విచారణ పై గతంలో ఉన్న అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, సుమిత్ రాయ్ కేసులతో కలిపి ...

Read More »

బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష..!

సినీ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్టు బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈమేరకు తీర్పిచ్చిన కోర్టు.. ఫిర్యాదుదారు నుంచి తీసుకున్న అప్పు రూ.95 లక్షలు వెంటనే తిరిగి చెల్లించాలని, కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకీరామయ్య అనే వ్యక్తి వద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పు తీసుకున్నాడు. జానకీరామయ్య చనిపోగా ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షలకు చెక్ ఇచ్చాడు. ...

Read More »

నితేశ్ తివారీ రామాయణంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు….

బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ రూపొందించనున్న రామాయణంపై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు భారీ తారాగణంతో రూపొందించనున్నారని కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తుంది. ఇతిహాసలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఇదీ తెరకెక్కినుంది. ఇందులో శ్రీ రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటించనున్నారు. అలాగే రావణుడిగా కేజీఎఫ్ స్టార్ హీరో యశ్ నటిస్తారని , ఆంజనేయుడి గా బీటౌన్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో రకుల్ శుర్పణఖగా కనిపించనుందాని టాక్ వినిపిస్తుంది. తాజాగా ...

Read More »

నా ప్రాంత అభివృద్ధి కోసమే స్టూడియో: మహి

హర్సిలీహిల్స్లో ప్రభుత్వం తనకు 2 ఎకరాలు ఇచ్చిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై యాత్ర-2 డైరెక్టర్ మహి.వి.రాఘవ్ స్పందించారు. ‘నేను 100 ఎకరాలు అడగలేదు. సొంత ప్రయోజనాల కోసం అయితే HYD, వైజాగ్లో అడిగేవాడిని. వెనుకబడిన నా ప్రాంత అభివృద్ధి కోసం 2 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరా. గ్రామీణ ప్రజల కోసమే హర్సిలీహిల్స్లో మినీ స్టూడియో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా’ అని ట్వీట్ చేశారు.

Read More »

తెలుగు ఇండస్ట్రీకి ఆయన త్రినేత్రమని వ్యాఖ్యనించిన పరుచూరి …

చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం లభించడం గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. చిరంజీవి కెరియర్ ఆరంభంలో నెగెటివ్ రోల్స్ ను సైతం పోషించారు. ఆ తర్వాత వచ్చిన ఖైదీ ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆర్టిస్టు జీవితాన్ని మార్చిన సినిమాకి పనిచేయడం మా అదృష్టంగా మేము భావిస్తుంటాము అన్నారు. రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డు ఫంక్షన్ వెళ్లాను. ఒక అత్యున్నతమైన పురస్కారం లభించిన తర్వాత వేసే అడుగులు మరింత జాగ్రత్తగా .. ఆదర్శవంతంగా ఉండాలనే ఆయన మాటలు నాకు బాగా నచ్చాయి. ఎవరి సపోర్టు లేకుండా ...

Read More »