Politics

ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులపై స్పందించిన కేసీఆర్

ఎన్నికల సంఘం తనకు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్పందించారు. వివరణ ఇచ్చేందుకు తనకు మరో వారం రోజులు గడువు కావాలని కోరారు. ఇటీవల సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌పై, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఆయన విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు గాను గురువారం ఉదయం 11 గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ...

Read More »

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న ఆర్కే

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు పేరును చార్జ్ షీట్ లో తెలంగాణ ఏసీబీ 22 సార్లు ప్రస్తావించిందని… అయినప్పటికీ చంద్రబాబు పేరును నిందితుడిగా చేర్చలేదని పిటిషన్ లో ఆళ్ల పేర్కొన్నారు. అయితే, ఈ కేసు విచారణను సెలవుల తర్వాత చేపట్టాలని తెలంగాణ ...

Read More »

సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం..!

సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని. విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి పై కేశినేని నాని, వెళ్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయ వాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ….సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం ఉందని ఫైర్‌ అయ్యారు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అతని ఇద్దరి కుమారులు రౌడీ యిజం చేస్తన్నారని ఆగ్రహించారు. బోండా ఉమా ...

Read More »

నేటి నుంచి నామినేషన్లు

APలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలు, ఒక MLA స్థానంలో ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసుకోవచ్చు. ఉ.11-మ. 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం సెలవు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.

Read More »

ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు.. చంద్రబాబు ఆయనకు షాకిచ్చారు: విజయసాయిరెడ్డి

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో పచ్చపార్టీ ఆ టికెట్‌ను వేరొకరికి ఇచ్చిందని ఆరోపించారు. దీంతో ...

Read More »

రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు..

వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉపరితలంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డి ప్రకటించింది. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లురి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. రేపు చిత్తూరు, శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, ...

Read More »

సీఎం జగన్‌ పై రాయి కేసులో ట్విస్ట్‌..ఏ2గా టీడీపీ నేత ?

సీఎం జగన్‌ పై రాయి కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సతీష్, దుర్గారావు ఇద్దరిని నేడు అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో ఏ1గా రాయితో దాడి చేసిన సతీష్, ఏ2గా దుర్గారావు పై కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీలో సెంట్రల్ నియోజక వర్గంలో యాక్టివ్ గా దుర్గారావు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్టు విచారణలో గుర్తించారు పోలీసులు. ...

Read More »

నంద్యాలలో జనసేనకు బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

ఎన్నికల వేళ రాష్ట్రంలోని జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. నంద్యాలకు చెందిన కీలక నేత, జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్ ఈ రోజు వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అతను.. పొత్తులో భాగంగా.. టికెట్ దక్కక పోవడంతో కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనను పార్టీలోకి శిల్పా మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. కాగా ఈ సమయంలో విశ్వనాథ్ వెంట భారీగా జనసేన నాయకులు కూడా వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ...

Read More »

బీఆర్ఎస్ కు షాకిచ్చిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే

లోక్ సభ ఎన్నికల వేళ భారత రాష్ట్ర సమితికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారు. ఎంపీ టికెట్ల కేటాయింపులపై అసంతృప్తితో బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కేటాయింపులో ఎవరినీ సంప్రదించకుండానే లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారని ఆరోపించారు. లక్ష్మారెడ్డి అవకాశవాది అని, ఆయనను గెలిపించాలంటూ ప్రజల ముందుకు వెళ్లలేనని బీఆర్ఎస్ ...

Read More »

తొలి దశ పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా ఏప్రిల్ 19న (శుక్రవారం) తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదని ఈ లేఖ ద్వారా మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పదలచుకున్నాను. దేశంలోని కుటుంబాలు, ముఖ్యంగా వృద్ధులకు గత 5-6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలు గుర్తుండే ఉంటాయి. అయితే గత 10 పదేళ్ల ఎన్డీయే పాలనలో సమాజంలోని అన్ని వర్గాల జీవన నాణ్యత మెరుగైంది. సమస్యలు చాలా ...

Read More »