Politics

షర్మిల వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన అవినాశ్ రెడ్డి

వివేకా హంతకుడు ఎంపీ అవినాశ్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎంపీ అవినాశ్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. మసి పూస్తారు, బురద చల్లుతారు… వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు… వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా… దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు అని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మాట్లాడుకోవాలంటే అంత మాట్లాడుకోండి… నాకెలాంటి అభ్యంతరం లేదు… ...

Read More »

గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌ సీఎం జగన్‌

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తీర్పు సుస్పష్టంగా ఉండబోతుందని గూగుల్‌ ట్రెండ్స్‌ చెబుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి చేసే వేర్వేరు ప్లాట్‌ఫాంలపై చేసే పోస్టులను విశ్లేషించి, ఎవరిపై ఏ టాపిక్‌పై ఎంత సమయం గడుపుతున్నారన్న దాన్ని బట్టి.. గూగుల్‌ ట్రెండ్స్‌ ఫలితాలు ఇస్తుంది. ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టాప్‌లో ఉండగా.. దరిదాపుల్లో కూడా చంద్రబాబు లేకపోవడం గమనార్హం.

Read More »

కూటమిలో వారికి ప్రిఫరెన్సే లేదు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన, టీడీపీ అభ్యర్థులను చంద్రబాబే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనుకున్న వాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారని తెలిపారు. కూటమిలో చంద్రబాబు ఏది చెబితే అదే జరగాలని కోరుకుంటున్నారన్ని పేర్కొన్నారు. ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను చంద్రబాబు ...

Read More »

కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌.. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా శ్రీగ‌ణేష్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్య‌మైన విష‌యం తెలిసిందే. పార్ల‌మెంట్ ఎన్నిక‌లతో పాటే కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక ఈ ఉప ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్ పార్టీ శ‌నివారం త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. కంటోన్మెంట్ అభ్య‌ర్థిగా శ్రీగణేష్ పేరును ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ శ్రీగ‌ణేష్ పేరును ఖ‌రారు చేశారు. కాగా, శ్రీగ‌ణేష్ ఇటీవ‌లే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ...

Read More »

తెలంగాణ, ఏపీ ప్రజలకు చల్లటి కబురు

రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఎండలు కొడుతున్న సంగతి తెలిసిందే. బయట అడుగుపెట్టలేని పరిస్థితిలు నెలకొన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు అలాగే వడగాలులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు అలాగే రేపు తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాలలో తీవ్ర వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇలాంటి నేపథ్యంలో చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న నాలుగు జిల్లాలలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది జిల్లాల్లో 43.4° ఉష్ణోగ్రత నమోదు అయింది. ...

Read More »

నేడు కడప నగరంలో షర్మిల బస్సు యాత్ర

నేడు కడప నగరంలో షర్మిల బస్సు యాత్ర చేయనున్నారు. రెండవ రోజు కడప జిల్లాలో షర్మిల ఏపీ న్యాయ యాత్ర కొనసాగనుంది. తొలుత పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు షర్మిల. అనంతరం మసాపేట నుంచి ప్రచారం ప్రారంభం అవుతుంది. దేవుని కడప, బైపాస్, అశోక్ నగర్, అప్సరా వై జంక్షన్ కూడలిలో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత సంధ్య కూడలి, ఐటిఐ, మరియపురం సర్కిలల్లో ...

Read More »

తెలంగాణలో మార్పు వచ్చింది.. దేశంలో రావాలి: CM

తెలంగాణలో మార్పు వచ్చి ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందని, దేశంలో మార్పు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ నియంత పాలన అంతమవ్వాలని, కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిన తుక్కుగూడ గడ్డ నుంచి తెలంగాణ జన జాతర ప్రారంభమవ్వాలన్నారు. ఇవాళ జరిగే తుక్కుగూడ సభపై స్పెషల్ వీడియోను Xలో షేర్ చేసిన ఆయన.. ‘గోల్కొండ కోటపై జెండా పాతాం.. ఎర్రకోటపై జెండా ఎగరేద్దాం.. జన జాతరకు తరలిరండి’ అంటూ పిలుపునిచ్చారు.

Read More »

నేడు బీఆర్ఎస్ ‘రైతు దీక్ష’లు

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ‘రైతు దీక్ష’లు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హమీలు నెరవేర్చడంతో పాటు నీరు లేక ఎండిన పంటలకు నష్టపరిహారం, క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీశ్ రావు, సూర్యాపేటలో జగదీశ్ రెడ్డితో ఇతర నేతలు రైతు దీక్షలలో పాల్గొననున్నారు.

Read More »

కాంగ్రెస్లోకి 12 మంది BRS ఎమ్మెల్యేలు?

ఇవాళ తుక్కుగూడ సభలో కాంగ్రెస్లో 12మంది BRS MLAలు చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గంగుల కమలాకర్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కోవా లక్ష్మి, సుధీర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మాణిక్ రావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాగుంట గోపీనాథ్, బండారు లక్ష్మారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని BRS శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది సాయంత్రం తేలిపోనుంది.

Read More »

93.42శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ 93.42 శాతం పూర్తయింది. 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1874.85 కోట్లను ప్రభుత్వం అందించింది. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇళ్ల వద్దే పింఛన్లు అందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. నేడు కూడా ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్లు అందిస్తామని అన్నారు.

Read More »