వాషింగ్‌మిషన్‌ వాడేటప్పుడు క్లాత్ కండీషనర్స్ వాడుతున్నారా..

వాషింగ్‌మిషన్‌ వాడేటప్పుడు క్లాత్ కండీషనర్స్ వాడుతున్నారా..

వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతికేటప్పుడు ఒక్కసారే అయిపోతాయి కదా అని అన్ని బట్టలు ఒకేసారి మెషిన్ లో వేస్తాం అయితే ఇలా చేయకూడదు. అది ఎంత పెద్ద మెషిన్ అయినా, ఎక్కువ కెపాసిటీ ఉన్నప్పటికీ, టబ్‌ను ఓవర్‌లోడ్ చేయడం మంచిది కాదు. మీరు టబ్‌ను ఓవర్‌లోడ్ చేసిన తర్వాత, బట్టల్లోని వాసన బ్యాక్టీరియాను తొలగించే మిషన్ సరిగా పనిచేయదు.. దీంతో బట్టలు సరిగ్గా శుభ్రం కావు. అందుకే కొన్ని సార్లు బట్టలు ఉతికిన వాసన వస్తాయి. అందుకే ఇంకోసారి వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతికేటప్పుడు టబ్‌ను ఓవర్‌లోడ్ చేయకుండా ఉంచండి.

​తడి బట్టలు ఎక్కువ సేపు టబ్‌‌లో వదిలేస్తున్నారా?

ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో అన్ని పనులు పరుగులు తీస్తూ చేస్తూ ఉంటాం . తిండి తినడం దగ్గర నుంచి అన్ని పనులు అలానే చేస్తాం.. ఈ బిజీ షెడ్యూల్‌లో బట్టలు ఉతకడం మరింత కష్టమైన పని.. అందుకే, వాషింగ్ మిషిన్స్‌పై ఆధారపడతున్నారు. ఇప్పుడు వాషింగ్ మెషిన్ లో కొత్త టెక్నాలజీ వచ్చేసింది. బట్టలు ఎంత సమయం ఉతకాలని పెడితే అంత సమయంలో మెషిన్ దాని అంతట అదే ఆగిపోతుంది. అందుకోసం బట్టలను ఖాళీ దొరికిన సమయంలో, రాత్రిపూట, పనికి వెళ్లే సమయంలో మెషిన్ లో వేస్తూ ఉంటారు. వాటిని పని నుండి వచ్చిన తర్వాత, లేక ఉదయం పూట తీసి అరేస్తూ ఉంటారు. అయితే, బట్టలను ఎక్కువ సేపు టబ్‌లో వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల బట్టల నుంచి వాసన వస్తాయి. అందుకే, బట్టలు ఉతికిన వెంటనే ఆరబెట్టాలి, అలా తడి బట్టలు వదిలేస్తే ఇలానే వాసన వస్తాయి.