బిల్వపత్రాన్ని శివుడు ఎందుకు అంతగా ఇష్టపడతాడంటే...!

బిల్వపత్రాన్ని శివుడు ఎందుకు అంతగా ఇష్టపడతాడంటే…!

బిల్వ పత్రం, మారేడు పత్రం అనగానే ముందుగా శివుడే గుర్తొస్తాడు. శివపూజ జరిగినప్పుడు కచ్చితంగా బిల్వ పత్రాన్ని వాడతారు. ఈ ఆకులేనిదే శివపూజ పూర్తి కాదు.. అందుకే ప్రతి శివాలయంలో నూ ఈ చెట్టు ఉంటుంది. భక్తులు కూడా ఈ చెట్టును అంతే శ్రద్ధగా పూజిస్తారు. అయితే, ఈ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. వీటిని నేరుగా తీసుకున్నా, కషాయం చేసి తాగినా అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు ఆ ప్రయోజనాలో ఇప్పుడు చూద్దాం..

మారేడు ఆకులతో ఏమేం జబ్బులు దూరం..
మారేడు ఆకులు, బిల్వ పత్రాలను వాడే విధంగా వాడితే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇవి బీపీని తగ్గించడమే కాకుండా.. షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. అంతేనా వీటిలోని ప్రత్యేక గుణాలు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. వీటితో పాటు చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి.

ఒంట్లోని వేడిని తగ్గించే మారేడు..
మారేడు ఆకులతో శరీరంలోని వేడిని తగ్గించొచ్చు. ఇందుకోసం మారేడు పండు గుజ్జుని మెంతులతో కలిసి దంచాలి. అయితే, ముందుగా మెంతులను నానబెట్టాలి. అప్పుడు మంచిగా పేస్ట్‌లా అవుతుంది. ఇలా తయారైన పేస్ట్‌ని తలకి ప్యాక్‌లా వేసి తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఒంట్లోని వేడి తగ్గడమే కాకుండా జుట్టు సమస్యలు కూడా దూరం అవుతాయి.

గుజ్జు కూడా మంచిది..
మారేడు పండు గుజ్జుని కూడా నేరుగా తినొచ్చు. దీని వల్ల కడుపులోని అల్సర్స్, పురుగులు తగ్గిపోతాయి. అందుకే వీటిని అనేక ఆయుర్వేద మందుల తయారీల్లో వాడతారు. కాబట్టి వీటిని నేరుగా తీసుకోవచ్చు..