బాలయ్యను కలిశా… చిరూనీ కలుస్తా: విష్ణు

సినీ పరిశ్రమలోని పెద్దలందరినీ కలుపుకొని  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ అభివృద్ధికి పాటుపడతానని నటుడు, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు.  ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణు…  వరుసగా సినీ పెద్దలను కలిసే పనిలోపడ్డారు. ఆ క్రమంలోనే  తొలుత తనకు మద్దతుగా నిలిచిన నందమూరి బాలకృష్ణను  కలిశారు. తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి గురువారం ఉదయం బాలయ్య ఇంటికి వెళ్లారు. ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం వంటి అంశాలపై బాలకృష్ణతో చర్చించారు. భేటీ అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయనను కలవడం ఆనందంగా ఉంది. అన్నయ్య యన్‌.టి.రామారావు గారే నన్ను బాలయ్య ఇంటికి పంపించినట్లు ఉంది. ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా ఉంటానని చెప్పారు’ అని తెలిపారు.