యువ నిర్మాత సందీప్ కొరిటాల‌ మృతి

యువ నిర్మాత సందీప్‌ కొరిటాల హఠాత్తుగా మరణించాడు. ఆదివారం ఆయన గుండెపోటుతో మతి చెందాడు. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా వచ్చిన ‘స్వామి రారా’, నారా రోహిత్‌ హీరోగా చేసిన ‘రౌడీ ఫెలో’ సినిమాలకు సందీప్‌ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించాడు. సందీప్‌ మతి పట్ల నారా రోహిత్‌, దర్శకుడు సుధీర్‌ వర్మ సంతాపం తెలిపారు.