Monthly Archives: September 2021

చిరంజీవి, నాగార్జున కోరడంతోనే ఆన్‌లైన్‌ టికెట్లు: రోజా

వైసీపీ పార్టీ, నగరి ఎమ్యెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సిఎం జగన్ అమలు చేస్తూన్నారని ఎమ్యెల్యే రోజా పేర్కొన్నారు. వాళ్ళ నిర్ణయం మేరకే సిఎం జగన్ ఆఅ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు చాలా భాథాకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతతో వదిలేస్తూన్నామని పేర్కొన్నారు ఎమ్యెల్యే రోజా. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. కోడేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ కూండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు ...

Read More »

శ్రీవారిని దర్శించుకున్న సమంత

సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారిని దర్శించుకున్న సమంతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  కాగా సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్‌ మూవీలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కితున్న ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, నయన తారలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనితో పాటు సామ్‌ ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సంతకం చేసినట్టు వినికిడి.

Read More »

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై టీడీపీ కార్యకర్తల దాడి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అక్కడ టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై జోగి రమేశ్ స్పందిస్తూ… తమ ఆరాధ్య దైవం జగన్ గురించి టీడీపీ నేతలు మాట్లాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ...

Read More »

మాస్ట్రో మూవీ రివ్యూ

హీరో నితిన్‌ మూవీలంటేనే రొటీన్‌కి భిన్నంగా ఉంటాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా.. నితిన్‌ విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆయన నటించిన మూవీ మాస్ట్రో. ఈసినిమా సెప్టెంబర్‌ 17న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్‌ అంధాదున్‌ రీమేక్‌్‌గా తెరకెక్కింది. బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా నటించిన పాత్రలో నితిన్‌ నటించారు. బాలీవుడ్‌లో హిట్‌ కొట్టిన చిత్రం.. తెలుగులో దర్శకుడు మేర్లపాక గాంధీ ఎలా తెరకెక్కించారు? ప్రేక్షకులను అలరించిందో లేదో తెలుసుకుందామా? కథ అరుణ్‌ (నితిన్‌) ఓ అంధుడు. తన బాల్యంలో ...

Read More »

పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

 ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ లో కేవలం వారం రోజుల ముందు ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి మే ...

Read More »

కొత్త సినిమాకి సమంత గ్రీన్‌ సిగ్నల్

ఇటీవలే సమంత పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసింది. మరోవైపు తమిళంలో విగేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఎస్‌ఆర్‌ ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌లో ఓ సినిమా ప్రాజెక్ట్‌ కోసం సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్‌ గురించి ఇతర వివరాలు చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.

Read More »

ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ పాలిటెక్నిక్‌ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే.. 94.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన కె.రోషన్‌లాల్‌, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్‌వర్ధన్‌ మొదటి ర్యాంకు సాధించారు. వీరిరువురికి 120 మార్కులు వచ్చాయి.

Read More »

మహేశ్‌ ఫ్యామిలీ ఇంట వినాయక నిమజ్జన వేడుకలు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఫ్యామిలీ ప్రతి ఏటా వినాయక చవితి పండగను ఘనంగా జరుపుకుంటుంది. ఇంట్లో గణేశ్‌ విగ్రహాన్ని ప్రతిష్టించి నిష్టగా పూజలు చేస్తారు. అయితే ఈ సారి పర్యావరణ సహిత వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నారు ఘట్టమనేని ఫ్యామిలీ. ఘనంగా పూజలు నిర్వహించడమే కాదు.. నిమజ్జనం కూడా అలాగే చేశారు.మ‌ట్టి గ‌ణేషుడిని ఇంట్లోని తొట్టిలో నిమ‌జ్జ‌నం చేయ‌గా, ఆ కార్య‌క్రమంలో మ‌హేశ్‌, న‌మ్ర‌త‌, సితార‌, గౌత‌మ్ పాల్గొన్నారు.

Read More »

ఈఎపిసెట్‌-2021 ఫలితాలు విడుదల

ఎపి అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎపి ఈఎపిసెట్‌-2021) ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఇంజినీరింగ్‌ ఫలితాలను వెల్లడించగా.. తాజాగా అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలను వెల్లడించారు. మంగళవారం మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశానికి 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 78,066 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాల్లో 72,488 (92.85 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు.

Read More »

సైదాబాద్‌ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మంచు మనోజ్‌

సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారంపై హీరో మంచు మనోజ్‌ స్పందించాడు. మంగళవారం బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను మనోజ్‌ పరామర్శించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  చిన్నారి విషయంలో జరిగింది అత్యంత క్రూరమైన చర్య అన్నాడు. బాలికపై జరిగిన ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపు నిచ్చాడు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలన్నాడు. 

Read More »