ఇమ్యునిటీ పెంచుకోవాలా? రోజూ ఈ జ్యూస్‌ ట్రై చేయండి

కరోనా వైరస్ నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిందే. వ్యాక్సిన్ వచ్చే వరకే కాదు.. భవిష్యత్తులో మరే వ్యాధులు శరీరంపై దాడి చేయకుండా ఉండాలంటే తప్పకుండా ఇమ్యునిటీ పెంచుకోవాలి. నిత్యం వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారం తింటూ.. జంక్ ఫుడ్‌గా దూరంగా ఉంటూ.. వేళకు భోజనం చేస్తూ.. సమయానికి నిద్రపోతూ.. మొబైల్‌కు వీలైనంత దూరంగా ఉండటం వంటివి కూడా మీమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆరోగ్యకరమైన జ్యూస్‌లను తీసుకుంటూ క్రమేనా ఆరోగ్యవంతులవ్వండి. వైరస్‌, బ్యాక్టీరియాలను ఎదుర్కోతగిన రోగ నిరోధకశక్తిని పెంచుకోండి.

శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. యాంటీఆక్సిడెంట్స్ పెంపొందించుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ కింది జ్యూస్‌ను తయారు చేసుకుని తగడానికి ప్రయత్నించండి. మరి ఈ ఇమ్యునిటీ షాట్స్ (జ్యూస్) తయారీ ఎలాగో చూద్దామా!

పసుపు, ఉసిరి, మిరియాలు, తేనె.. వంటివి శరీరంలో ఇమ్యునిటీని పెంపొందించేందుకు పనిచేస్తాయి. వీటికి తయారీకి అవసరమైనవి ఇవే.

పసుపు – 250 గ్రాములు
ఉసిరి – 200 గ్రాములు
అల్లం – 100 గ్రాములు
టేస్ట్ కోసం తగినంత తేనె, మిరియాలు

తయారీ విధానం: ఉసిరి, పసుపు, అల్లాన్ని ముద్దగా చేసుకుని నీటిలో కలపండి. ఆ తర్వాత ఆ నీటిని వడపోయండి. వాటిలోని రసమంతా ఆ నీటిలోకి దిగేవరకు పిప్పిని గట్టిగా నొక్కండి. అనంతరం ఆ జ్యూస్‌ను చిన్న షాట్ గ్లాసులో వేసుకుని ఉదయాన్నే తాగండి. ఇలా రోజూ చేస్తే.. తప్పకుండా మంచి ఫలితం ఉండొచ్చు. ఉసిరి స్థానంలో దాల్చిన చెక్క, బీట్‌రూట్, క్యారెట్, యాపిల్‌ను సైతం కలిపి ఈ ఇమ్మునిటీ షాట్స్‌ను తయారు చేసుకోవచ్చు. అయితే, వీటిని పెద్ద గ్లాసుల్లో కాకుండా కొద్ది కొద్దిగా తాగితేనే మంచిది.