పవన్‌కు జోడిగా నిత్యా మీనన్

లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత చిత్ర పరిశ్రమ షూటింగ్‌లతో కళకళలాడుతోంది. చిన్న హీరోల నుంచి బడా హీరోలు సెట్‌లో అడుగుపెట్టి సందడి చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్ కూడా ఈ నెల రెండో వారం నుంచి తన మలయాళ రీమేక్ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రీకరణలో పాల్గొనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా టాలెంటెడ్ యాక్టర్ నిత్యామీనన్‌ నటిస్తోంది. హైదరాబాద్ లో మొదలైన ‘ఆచార్య’ షూటింగ్ ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తొలిసారి పవన్‌కల్యాణ్‌ – నిత్యమేనన్‌ జోడీ కట్టనున్నారు. ఇద్దరూ కలిసి ఈ నెల 12 నుంచి మొదలయ్యే చిత్రీకరణతో కెమెరా ముందుకు అడుగు పెడుతున్నారు. నిత్యా మీనన్ తెలుగులో నటించిన గుండే జారి గల్లంతయ్యిందే , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించింది.నిత్యా మీనన్‌కు పవన్‌తో మొదటి సినిమా. దీంతో అభిమానుల్లో ఆశక్తి నెలకొంది.