Tag Archives: ysrcp

నేడు భీమిలిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్… దిశ నిర్దేశం చేయనున్న సీఎం వైయస్ జగన్

టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం చాలానే ఉంది.సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే చాలు అది నిజమే అని నమ్మేసే పరిస్థితులు ఉన్నాయి. వీటిని నడిపించే వాళ్ళను ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఈ పదం ఇప్పుడు ఓ సెన్షేషన్ గా మారింది. సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కిన ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లను మించి ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్న వాళ్లే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు. ఇన్ఫ్లుయెన్సర్స్ పార్టీలకు సంబంధించి ప్రచారం చేస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా ...

Read More »

సీఎస్ కీలక ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29 వరకు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపాలని ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జాగ్రత్త పడాలని సీఎస్ సూచించారు.

Read More »

మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తావా.. చంద్రబాబూ : YCP

ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వైసీపీ ప్రశ్నించింది. ‘చంద్రబాబూ చూశావా ముస్లింలపై బీజేపీ నిజస్వరూపం! దేశ సంపద ముస్లింలకు ఇస్తే ఊరుకుంటామా? అని స్వయంగా మోదీ గారే చెప్తున్నారు. అలాంటి బీజేపీతో నువ్వు, పవన్ పొత్తు పెట్టుకున్నారు. మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తావా? లేదా మైనారిటీల పక్షాన నిలబడి వ్యతిరేకించే దమ్ము టీడీపీ, జనసేనలకు ఉందా?’ అని YCP ట్వీట్ చేసింది.

Read More »

టీడీపీ సాంగ్‌పై ఈసీకి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సాంగ్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిలపై సైతం ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు, పవన్, షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 100 చోట్ల సమస్యాత్మక బూత్‌లున్నాయని, అక్కడ ...

Read More »

సీఎం జగన్‌ ఇవాళ్టి బస్సుయాత్ర షెడ్యూల్‌ ఇదే

సీఎం జగన్‌ ఇవాళ్టి బస్సుయాత్ర షెడ్యూల్‌ విడుదల అయింది. మేమంతా సిద్ధం – 21వ రోజు షెడ్యూల్ ప్రకారం… వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 9 గంటలక ఎండాడ MVV సిటీ రాత్రి బస నుంచి బయలుదేరి మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని బొద్దవలస మీదుగా సాయంత్రం ...

Read More »

అలాంటి వాళ్ల గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది: సజ్జల

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి అంశంపై స్పందించారు. చిరంజీవిని ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టరని స్పష్టం చేశారు. చిరంజీవి గొప్ప సినిమా స్టార్ అని, కానీ ఆయన బ్యాంకులను మోసం చేసిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారని సజ్జల పేర్కొన్నారు. చెడు ఆలోచనలు చేసే వారి గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ కు ...

Read More »

సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు

సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సతీష్‌ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి నిందితుడి నుండి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తుండగా విజయవాడలో సీఎం జగన్‌పై రాళ్ల ...

Read More »

వైసీపీలో చేరిన నటుడు గౌతం రాజు

ఎన్నో చిత్రాల్లో నటించిన గౌతం రాజు నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గౌతం రాజుతో పాటు కొంత మంది కార్యకర్తలు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

Read More »

నేను సీబీఐ విచారణకు సిద్ధం.. నువ్వు రెడీనా చంద్రబాబూ?: కాకాణి

తాను సహజ వనరులను దోచేశానంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ‘ఆ అభియోగాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్టును కోరేందుకు నేను సిద్ధం. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఆయనకు ఉందా? సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి చూపిస్తాను రండి. ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పుకోలేక నాపై విమర్శలు చేసి వెళ్లిపోయారు’ అని మండిపడ్డారు.

Read More »

సీఎం జగన్ పై రాళ్ల దాడి చేస్తామంటూ ఫోన్ కాల్స్!

సీఎం జగన్ కు మరో షాక్‌ తగిలింది. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై రాళ్ల దాడి చేస్తామంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారట కొంత మంది దుండగులు. సీఎం జగన్ పై రాళ్ల దాడి చేస్తామంటూ ఆకతాయిలు 1902 హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి బెదిరించారని సమాచారం అందుతోంది. దీంతో ఏపీ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం జగన్‌ ఆదివారం విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో రాళ్ల దాడి చేస్తామని ...

Read More »