దేవుడిని ఏ పువ్వుతో పూజిస్తే ఏం ఫలితమో తెలుసా ?

దేవుడు పూజ చేయని భక్తులు ఉండరు. అందులో ప్రతీ ఒక్కరూ తమ శక్తి మేరకు పూజను చేస్తారు. అయితే ప్రధానంగా పూజలో ఉపయోగించేవి కొబ్బరికాయ, పూలు, పండ్లు, సుగంధ పదర్థాలు, ప్రసాదాలు. ప్రస్తుతం పూజలో ఉపయోగించే ఆయా రకాల పూలను దేవుడికి పూజ చేస్తే ఏం ఫలితం లభిస్తుంది అనే విశేషాలను తెలుసుకుందాం…

నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే … జేవితంలో సుఖం ,శాంతి ,ప్రశాంతత లబిస్తుంది. పారిజాత పువ్వుని దేవుడికి సమర్పిస్తే .. కాల సర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి లబిస్తుంది. జాజి పూలు..అర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి. రుద్రాక్ష పువ్వును అర్పిస్తే …ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం మీదే అవుతుంది. మొగలి పువ్వును సమర్పిస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడుతాయి. దేవునికి సంపెంగ పూలు అర్పించి..ప్రసాదం స్వీకరిస్తే ..మాంత్రిక ప్రయోగాలు మీఫై పని చేయవు . శత్రువుల బాధ నివారణ సాధ్యం అవుతుంది.

పద్మం లేదా కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర నివారణ. శ్రీమంతులు అవుతారు. మల్లె పువ్వుతో పూజిస్తే అన్ని రోగాలు నయం అవుతాయి .ఆరోగ్యం వస్తుంది.  కల్హార పుష్పం తో పూజిస్తే …
అందరిలోనూ మీకు గుర్తింపువచ్చి ఆకర్షణ వస్తుంది. గన్నేరు పూలతో పూజిస్తే..
కవులకు కల్పనా సాహిత్యం వృద్ది చెందుతుంది. కంద పుష్పంతో పూజ చేస్తే ….
ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది. తుమ్మి పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే …
దేవునిఫై భక్తి అధికం అవుతుంది. పాటలీ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక భాదలు తొలగిపోతాయి .విద్య ప్రాప్తి సిద్దిస్తుంది..దుర్గా దేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవి అనుగ్రహంతో శత్రువుల బాధపోతుంది. పున్నాగ పుష్పం… ఈ పువ్వుతో శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ,శ్రీ గోపాలకృష్ణనికి పూజ చేస్తే మగ శిశువు పుట్టే అవకాశం ఉంటుంది. వకుళ పుష్పం … శ్రీ భూవరాహ స్వామికి , శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది.

అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే …. జీవితంలో.. సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి. తెల్లని జిల్లేడు పువ్వుతో … గణేశునికి ,శంకరునికి ,సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ,ఆరోగ్య్యం కలుగుతుంది. ఇలా అయా పుష్పాలను భక్తి, శ్రద్ధలతో పూజిస్తే తప్పక పైన చెప్పిన ఫలితాల కలుగుతాయని ఆయా పురాణాలలో పేర్కొన్నాయి. ఒకవేళ ఆయా పుష్పాలు దొరకని సందర్భంలో అందుబాటులో ఉన్న పుష్పాలను ఉపయోగించి భగవంతుడిని ప్రార్థన చేసిన తప్పక భక్తుల కోరికలు తీరుస్తారని పండితులు అభిప్రాయ పడుతున్నారు.