కరోనాతో యాక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత!

నటుడు, సినిమాటోగ్రాఫర్‌ షమన్‌ మిత్రు (43) గురువారం చెన్నైలో కన్నుమూశారు. కోవిడ్‌ మహమ్మారి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ (డిఓపి)గా ఆయన పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. 2019లో తోరతి చిత్రంలో ఆయన గొర్రెల కాపరి పాత్రలో నటించారు. ఈ సినిమా గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గొర్రెల కాపరుల జీవితాలను ప్రతిబింబిస్తుంది. కాపరి పాత్రలో నటించాలంటే.. నటులు ఆ జీవనశైలికి తగ్గట్టుగా.. బరువు తగ్గాలి.. కొన్ని మైళ్ల దూరం గొర్రెల వెంట చెప్పుల్లేకుండా నడవాలి.. ఎండ వేడిమిని తట్టుకోవాలి.. ఇవన్నీ చేయడానికి చాలామంది నటులు ఇప్టపడరు. కానీ నేను ఆ పాత్ర చేయడానికి ఎంతో ఇష్టంగా ఆ పాత్రకు తగ్గట్టుగా.. వర్కవుట్స్‌ చేసి నటించాను’ అని అన్నారు