కాంచన – 3 హీరోయిన్‌ అలెగ్జాండ్రా మృతి

కాంచన -3 మూవీ హీరోయిన్‌ రష్యన్‌ నటి అలెగ్జాండ్రా జావి అనుమానాస్పదంగా మృతి చెందారు. గోవాలో ఆమె అద్దెకుంటున్న అపార్టుమెంటు గదిలో శుక్రవారం ఉరివేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆమె చనిపోయిన మూడు రోజుల తర్వాత విషయం బయటకు రావడంతో అసలు ఆమెది ఆత్మహత్యా? లేక హత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలెగ్జాండ్రా అకస్మాత్తుగా మృతి చెందడం సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల కిందట ఆమెకు తన ప్రియుడికి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారని సినీ వర్గాల సమాచారం. మరోవైపు ఇటీవల చెన్నైలో ఓ యాక్టింగ్‌ స్కూల్‌లో చేరిన ఆమె.. అక్కడి ఫొటోగ్రాఫర్‌ తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలెగ్జాండ్రా ప్రియుడితోపాటు.. ఫొటో గ్రాఫర్‌ను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.