ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదా..

మనం తినే ఆహారం విషయంలో ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా.. మన హెల్త్‌ని దృష్టిలో పెట్టుకునే చేయాలి.

పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అందుకని ప్రతిరోజూ మనం బయటికి వెళ్ళి వీటిని కొనుక్కుని తీసుకురాలేం కదా.. అందుకే వారానికి ఓ సారి సరిపడా ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెట్టుకుంటారు. వీటిని నిల్వ చేసుకుని ఫ్రిజ్‌లో పెడతారు. అందువల్ల తాజాగా ఉంటాయి. అయితే, వేటిని పడితే వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. కాబట్టి ఏ ఆహారం ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలో తెలుసుకోండి..

పుచ్చకాయ..

వేసవిలో అందరూ ఎక్కువగా పుచ్చకాయని తింటారు. దీని వల్ల కడుపు నిండిన భావన వస్తుంది.. దాహం తీరుతుంది. దీనిని తినడం వల్ల కంటి చూపు చల్లబడడమే కాకుండా.. ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం అవుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుతుంది. అయితే, దీనిని కొంతమంది ఫ్రిజ్‌లో పెట్టి తింటారు.. కానీ, ఇది ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.. ఎందుకంటే రిఫ్రిజిరేటర్‌లో చల్లని గాలి యాంటీ ఆక్సిడెంట్ మూలకాల పెరుగుదలను తగ్గిస్తుంది. పుచ్చకాయని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల దాని రుచి మారిపోతుందని చెబుతున్నారు నిపుణులు..

ఆలుగడ్డలు..

ఆలుగడ్డల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. అయితే, చల్లని ఉష్ణోగ్రతలు ఆ పిండి పదార్థాలను చక్కెర పదార్థంగా మారుస్తాయి. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు చెబుతున్నారు నిపుణులు. వీటిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఓ పేపర్ బ్యాగ్‌లో పెట్టి ఎండకు దూరంగా ఉంచడం మంచిది.

ఉల్లిపాయలు..
ఉల్లిపాయలని కూడా ఫ్రిజ్‌ పెట్టడం అంత మంచిది కాదు.. కొంత మొత్తంలో వాయువును విడుదల చేస్తాయి. కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల మొత్తం ఫ్రిజ్ వాసన వస్తుంటుంది. కాబట్టి.. రంధ్రాలు ఉన్న బుట్టలో పెట్టండి..