కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే ఫేస్ మాస్క్ ధరించాల్సిందేనా..

కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి, ఫేస్ మాస్క్‌ల వాడకంపై సిడిసి మార్గదర్శకాలలోని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి –
సోషల్ డిస్టెన్స్ అనే నినాదంతో సామాజిక దూరం నిర్వహించాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. కానీ, కొన్ని అంశాల పరంగా దీన్ని నిర్వహించడం కష్టం. ఉదాహరణకి, కిరాణా దుకాణాలు, ఫార్మసీలు, మార్కెట్లు. ఇటువంటి ప్రాంతాలలో కచ్చితంగా మాస్కులు ధరించాలని సిడిసి సిఫార్సు చేస్తుంది.

వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి 6 అడుగుల కనీస సామాజిక దూరాన్ని నిర్వహించడం చాలా ముఖ్యమని సిడిసి వివరించింది.
వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి, వైరస్ ఉన్నవారి నుండి ఇతరులకు ప్రసారం కాకుండా, తెలియని వ్యక్తులకు సాయం చేసే సమయంలో, కనీసం సాధారణ వస్త్రాన్ని, ఫేస్ మాస్క్స్ ఉపయోగించమని సిడిసి సలహా ఇస్తోంది.
మాస్కులు అందుబాటులో లేనప్పుడు, కాటన్ వస్త్రాలతో తయారుచేసిన మాస్కులనైనా ధరించడం మంచిది. కాకపోతే వీటిని ఒకసారి వినియోగించిన తర్వాత కచ్చితంగా శుభ్రపరచాలి.

2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు, అపస్మారక స్థితిలో ఉన్నవారు, అసమర్థులు, సాయం లేకుండా ముసుగును ధరించడం లేదా తొలగించలేకపోవడం వంటివి చేయలేనివారు, ఈ మాస్క్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలయితే వారు ధరించకుండా, వారిపరంగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి.