విడాకుల తర్వాత అమాంతం పెరిగిన సమంత పాపురాలిటీ

అక్టోబర్‌ 2న సోషల్‌ మీడియా వేదికగా.. నాగచైతన్య – సమంత అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారి విడాకుల విషయం టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే సామ్‌ సోషల్‌మీడియాలో చేస్తున్న పోస్టులను చూస్తే మాత్రం వ్యక్తిగతంగా తాను ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొనే… విడాకుల దిశగా ఆలోచనలు చేసిందని పలువురు సినీనటులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత బంగారం లాంటి భవిష్యత్తును కాలదన్నుకున్నదనుకొని విడాకులు తీసుకుంటుందని కొందరు.. ఆమె బంగారు పంజరం నుంచి తప్పించుకుని.. స్వేచ్ఛగా బతకాలని బయటకొచ్చేసిందని మరికొందరు అంటున్నారు. ఇలా ఎవరి అభిప్రాయాలు వారికున్నా.. సమంత విడాకుల తర్వాత రేంజ్‌ అమాంతం పెరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది సోషల్‌ మీడియాలో అత్యంత ఎక్కువ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్స్‌ జాబితాను ఆర్మాక్స్‌ మీడియా విడుదల చేస్తుంది. ఈ ఏడాది అత్యంత ఎక్కువ ఫాలోయింగ్‌ ఉన్న ఈ జాబితాలో సమంత మొదటి స్థానంలో ఉంది.