Author Archives: News

తొక్కే కదా అని తీసిపారేయకండి..

బంగాళదుంప తొక్కలను తీసి పారేయకండి. అందులో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం సమృద్ధిగా ఉండే బంగాళదుంపలు గుండె, జీర్ణ, చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బంగాళాదుంప తొక్కల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచేందుకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడం ద్వారా జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బంగాళదుంప తొక్కలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్, కెరోటినాయిడ్, ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ...

Read More »

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తా అని చెప్పిన రేవంత్ ఇప్పుడు రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. దేవుళ్ల మీద ఒట్టు వేయ‌డం ఎందుకు? త‌న భార్య, పిల్ల‌ల మీద ఒట్టు వేయ‌డం లేదని మండిప‌డ్డారు. ఎందుకంటే దేవుళ్లు అడ‌గ‌రు కాబట్టి దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. పార్లమెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత రేవంత్ మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తాడ‌న్నారు. ...

Read More »

కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

వంటను ఎంత చక్కగా చేసినా.. ఉప్పు సరిగ్గా లేకుండే.. రుచే పోతుంది. ఉప్పును సరిపడా వేసుకుంటేనే వంటలు రుచిగా ఉండి తినాలనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా సాల్టే ఉపయోగిస్తున్నారు. కానీ రాళ్ల ఉప్పు వాడటం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కళ్లు ఉప్పును వంటల్లో ఉపయోగించడం వల్ల వంటలు కూడా రుచిగా ఉంటాయి. కళ్లు ఉప్పును కేవలం వంటల్లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా పలు రకాల సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ కళ్లు ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ...

Read More »

టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా!

టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని తాను కోరుకుంటున్నా అని వైసీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీని వెన్నుపోటు పొడిచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లారని మండిపడ్డారు. అత్యంత ధనవంతుడైన వేమిరెడ్డి నాసిరకం కాంట్రాక్టులు చేసి.. ప్రజల సొమ్మును పరోక్షంగా దోచుకున్నారని విమర్శించారు. విద్యను వ్యాపారం చేసి మహిళలను నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ మోసం చేశారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మూలపేట ప్రాంతంలో ఈరోజు విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సిటీ ...

Read More »

గన్ పార్క్ వద్దకు హరీశ్.. అనుమతి లేదన్న పోలీసులు

హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. గన్ పార్క్ వద్ద ప్రమాణం చేసేందుకు రాజీనామా లేఖతో హరీశ్ రావు అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంత్ కు ఆయన సవాలు చేసిన నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హరీష్ రావు రాక నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు అనుమతి నిరాకరించాగా… కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్ద 144 సెక్షన్, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని పోలీసులు చెప్పడంతో హరీశ్ రావు ...

Read More »

నేను ప్రభుత్వంలో నం.2 అనేది అబద్ధం: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేకుండా చేసిన పాపం చంద్రబాబుదేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. విజయవాడ హోటల్‌ ఐలాపురంలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో సజ్జల మాట్లాడారు. రాజధాని పేరుతో టీడీపీ అధినేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని తెలిపారు. తాను ఏపీ ప్రభుత్వంలో నం.2 అనేది అబద్ధమని సజ్జల చెప్పారు. జగన్‌ పెట్టిన పార్టీ.. ఆయన కష్టమ్మీద వచ్చిన పార్టీ అని తెలిపారు. జగన్‌ చేయగలిగినవన్నీచెప్పారని, చెప్పినవే గాకుండా దానికి మించి చేశారని అన్నారు. అవినీతిరహితంగా, పూర్తి పారదర్శకంగా, ...

Read More »

ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఈవీఎం-వీవీ ప్యాట్ కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వీవీప్యాట్ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలని పిటిషన్లు దాఖలు కాగా.. వంద శాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే సీల్ చేసిన సింబల్ లోడింగ్ యూనిట్లను ఈవీఎం స్ట్రాంగ్ రూంలలో భద్రపరచాలని కోర్టు సూచించింది. ఇక పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లను సైతం కోర్టు కొట్టేసింది.

Read More »

వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బండిపడుతున్నారా..?

చలికాలంలో దాదాపుగా ప్రతి ఒక్కరికీ చర్మం పొడిబారిపోయి పెదాలు పగిలిపోతుంటాయి. కానీ, వేసవిలో పెదవులు పగిలిపోతే దానికి కారణం ఏంటో తెలుసా..? వేసవిలో వాతావరణంలో తేమ శాతం చాలా వరకు తగ్గుతుంది. తేమ కోల్పోవడం వల్ల, పెదవులు పొడిబారడం మొదలవుతుంది. పగిలిన పెదవులపై కొబ్బరి నూనెను రాయండి. ఒకటి లేదా రెండు రోజుల్లో మీరు ఫలితాలను గమనిస్తారు. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది పెదాలను మృదువుగా, హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. కలబంద చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. పగిలిన పెదాలను ...

Read More »

ఎంపీ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం..

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయకపోవడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. 2001లో TRS ఆవిర్భావం తర్వాత 2004 ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ MPగా గెలిచారు. 2006, 2008 ఉపఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009లో మహబూబ్నగర్ MPగా ఎన్నికయ్యారు. 2014లో గజ్వేల్ MLAగా, మెదక్ MPగా గెలిచి, MP పదవికి రాజీనామా చేశారు. 2014లో ఆయన కుమార్తె కవిత నిజామాబాద్‌ MPగా గెలుపొందారు. 2019లో ఓడిపోగా, ఈసారి పోటీలో లేరు.

Read More »

మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!

మల్లెపువ్వు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఈ పువ్వు గురించి తెలుసు. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. మల్లె పూలు ఎక్కువగా వేసవి కాలంలో పూస్తాయి. చాలా మంది లేడీస్‌కి మల్లె పూలు అంటే చాలా ఇష్టం. మల్లెపూలు పెట్టుకుంటే.. జుట్టుకే అందం వస్తుంది. ఆయుర్వేదంలో కూడా మల్లెపూలను ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని సరైన పద్దతిలో ఉపయోగిస్తే మనకు తెలియని ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది. మల్లెపూవ్వుతో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి వాటిని తగ్గించుకోవచ్చు. ...

Read More »